పండ్ల రసాల తయారు చేసే మెషీన్లలో 18 లక్షల మాదక ద్రవ్యాల మాత్రలు
- March 06, 2018
దుబాయ్:మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు నానాటికి విభిన్న పద్ధతులను ఆశ్రయిస్తూ పోలీసుల కళ్ళు గప్పేందుకు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అధికారులు వారి ఎత్తుగడలను నిత్యం చిత్తు చేస్తూనే ఉన్నారు. రోడ్డుపై వేగంగా ఓ వాహనం వెళుతుంది.. ఆ మార్గంలో పహారా ఉన్న నిఘా పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. తనిఖీ నిమిత్తం వాహనం లోపల తొంగి చూస్తే జ్యూస్‌లు తయారుచేసే మెషీన్లు ఉన్నాయి. మండే వేసవి కదా ...సీజనులో ఇవి రవాణా కావడం మామూలే కదా అని వదిలిపెడితే స్మగ్లర్లు ఎంతో లాభపడిపోయేవారు. దూర దృష్టి కాస్త ఎక్కువ పాళ్ళు ఉన్న దుబాయ్ పోలీసులు వాహనం క్షుణంగా పరిశీలించేందుకు జ్యూస్ పరికరాలని కిందకు దింపించారు. ఆ జ్యూస్ మెషీన్ల విడి భాగాలను ఒక్కొకటి విడదీసి చూస్తే..ఆశ్చర్య పోయేలా 18 లక్షల కాప్టగాన్ మాత్రలు బయటపడ్డాయి. ఈ మాదకద్రవ్య మాత్రలు తీసుకొనేవారిని మెలకువగా ఉంచే, శారీరక నొప్పిని తగ్గించే, మానసిక ఉత్సాహాన్ని పెంచేవే కాప్టగాన్ పిల్స్. వీటిని ఎక్కువగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వాడుతుంటారు. అందుకే వీటిపై పలు దేశాల్లో నిషేధం ఉంది. సోమవారం దుబాయి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు.. అబూదబీ పోలీసులతో కలిసి భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. 18 లక్షల కాప్టగాన్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 159 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీటి అక్రమ రవాణాకు పాల్పడిన అయిదుగురు అరబ్ పౌరులను అరెస్ట్ చేసి విచారించి త్వరలో మొత్తం గుట్టు విప్పుతామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







