సూర్య '24' కథ లీక్
- November 29, 2015
దక్షిణాది సినీరంగంలో కమల్ హాసన్ స్థాయిలో ప్రయోగాలు చేసే విలక్షణ నటుడు సూర్య. సక్సెస్ లతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు సూర్య. అదే వరుసలో మరో ఎక్స్ పరిమెంటల్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాను సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. కమర్షియల్ హీరోగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన సూర్య, ప్రయోగాత్మక చిత్రాలతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకే '24' విషయంలో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ ఎంతో ఆశించి వస్తారు. అయితే సినిమాలో ఆడియన్స్ ఆశించిన అంశాలు లేకపోవటంతో నిరాశపడతారు. ఈ ప్రభావం సినిమా టాక్ మీద కూడా పడుతుందని భావించిన 24 యూనిట్ చిత్రకథను ముందే లీక్ చేశారు. '24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో సైంటిస్ట్ గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్ గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









