షేక్ మొహమ్మద్ టీమ్‌లో 70 శాతం మంది మహిళలే
- March 08, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలకు సందేశాన్నిచ్చారు. మార్చి 8వ తేదీ ఓ అద్భుతమైన మరియు ప్రత్యేకమైన రోజనీ, ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారనీ, యూఏఈలోనూ మహిళలు ఈ రోజున ప్రత్యేకంగా సంబరాలు జరుపుకుంటారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సి వుందనీ, మహిళా దినోత్సవం నాడు మాత్రమే కాక, ఏడాదిలో అన్ని రోజుల్లోనూ మహిళలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారాయన. తన టీమ్‌లో 70 శాతం మంది మహిళలే వున్నారని షేక్ మొహమ్మద్ గుర్తు చేశారు. ప్రతిరోజూ వారు ఎంతో నిబద్ధతో పనిచేస్తారనీ, ప్రతి మినిస్టర్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్ మహిళల సేవల్ని కొనియాడాల్సి ఉంటుందని, యూఏఈ అభివృద్ధిలో మహిళల పాత్ర మరువలేమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







