ఒమన్‌ యూనివర్సిటీ మహిళా డార్మిటరీలోకి వ్యక్తి, అరెస్ట్‌!

- March 08, 2018 , by Maagulf
ఒమన్‌ యూనివర్సిటీ మహిళా డార్మిటరీలోకి వ్యక్తి, అరెస్ట్‌!

మస్కట్‌: ఒమన్‌ యూనివర్సిటీలోని మహిళా డార్మిటరీలోకి ఓ వ్యక్తి ప్రవేశించగా, అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒమన్‌లోని సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీలో ఇటీవల ఓ వ్యక్తి, స్టూడెంట్‌ కాంప్లెక్స్‌లోని మహిళలకు చెందిన డార్మిటరీలోకి ప్రవేశించాడనీ, విచారణ జరుగుతోందనీ యూనివర్సిటీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. తాజాగా, ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీ వర్గాలు ఆన్‌ లైన్‌ ద్వారా స్పస్టం చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com