పారిస్ కు పయనమైన ప్రధాని మోడీ.!

- November 29, 2015 , by Maagulf
పారిస్ కు పయనమైన ప్రధాని మోడీ.!

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. పారిస్‌ బయలుదేరడానికి ముందు మోదీ విలేకరులతో మాట్లాడుతూ... పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.పారిస్‌ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండేతో మోదీ భేటీ కానున్నారు. ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలియన్స్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా అధ్యక్షత జరిగే మిషన్‌ ఇన్నోవేటివ్‌లో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com