భారత్‌కు ఝలకిచ్చిన ట్రంప్
- March 09, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌కు ఝలకిచ్చారు. హార్లీ డేవిడ్సన్ బైకులపై భారత పన్ను విధింపును వ్యతిరేకిస్తున్న ట్రంప్.. యూఎస్ఏలో స్టీలు, అల్యూమినియం దిగుమతిపై సుంకం పెంచనున్నారు. భారత్‌తో పాటు చైనాపై కూడా సుంకం పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికా టారీఫ్ కనుగుణంగా నడుచుకోకపోవడంతో ట్రంప్ ఈ పరస్పర పన్ను' కు సిద్ధమయ్యారు.
భారత్‌లో విక్రయించే అమెరికా ఆధారిత హార్లీ డేవిడ్సన్పై విధించే 50 శాతం పన్ను విషయమై ట్రంప్ పలుమార్లు ప్రస్తావించారు. 'భారత్ నుంచి యూఎస్ఏలో దిగుమతి చేసుకునే వాహనాలపై అమెరికా పన్ను విధించడం లేదు. అలాంటిది హార్లీ డేవిడ్సన్పై భారత్ ఎందుకు 50శాతం పన్ను విధిస్తున్నదని ప్రశ్నించారు. చైనా 25 శాతం, భారత్ 75శాతం పన్ను విధిస్తుంటే తాము ఎలాంటి పన్ను విధించడం లేదు. కనుక ఇక మేము పరస్పర పన్ను విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.' అని అన్నారు. కెనడా, మెక్సికో తప్ప అన్ని దేశాలపై స్టీల్‌పై 25 శాతం, అల్యూమీనియంపై 10 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. 'మాపై 50 శాతం పన్ను విధిస్తే.. మేమూ 50శాతం విధిస్తాం.' అని చెప్పుకొచ్చారు. పరస్పర పన్ను విధానం అమలు ద్వారా.. ఏ దేశం మధ్య వాణిజ్యపరమైన ఇబ్బందులు తలెత్తవని, సజావుగా వ్యాపారం జరుగుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఫలితంగా యూఎస్ఏకు స్టీల్ ఎగుమతి చేస్తున్న భారత్‌తో పాటు చైనా మార్కెట్ కు ప్రతికూల పరిస్థితి ఏర్పడనున్నాయి. చైనా, యూరప్ ఈ చర్యలకు దిగితే మనకు మరింత ఇబ్బందే. దేశానికి కీలకమైన ఉక్కును విదేశీ పరిశ్రమలు ప్రభావితం చేస్తున్నాయని.. మన ఉక్కును మనమే ఉత్పత్తి చేసుకుందామని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







