స్వచ్ఛంద మరణానికి సుప్రీం ఆమోదముద్ర!
- March 09, 2018
న్యూఢిల్లీ : చికిత్సకు అలవికాని వ్యాధులతో బాధపడుతున్న రోగులు స్వచ్ఛందంగా మరణించాలనుకోవడం వారికి గల ప్రాధమిక హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారిస్తూ స్వచ్ఛంద మరణానికి అనుమతినిచ్చింది. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన పలు మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. గతేడాది అక్టోబరు 11న ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదు గురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం పై తీర్పు చెప్పింది. ఎవరెవరు ఈ స్వచ్ఛంద మరణానికి అర్హులు, ఎవరికి అనుమతినివ్వాలి అనే విషయంపై కొన్ని నిబంధనలను రూపొందించింది. దీనిపై ఒక చట్టాన్ని తీసుకువచ్చే వరకు తాము జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు అమల్లో వుంటాయని సుప్రీం స్పష్టం చేసింది. నలుగురు న్యాయమూర్తులు విడివిడి అభిప్రాయాలు తెలిపినప్పటికీ తీర్పు మాత్రం ఏకాభి ప్రాయంతో ఇచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







