'నీది నాది ఒకే కథ అంటోన్న' శ్రీ విష్ణు
- March 11, 2018
చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వత హీరోగా మారిన శ్రీవిష్ణుకి ఇప్పుడు టాలీవుడ్లో మంచి పేరుంది. వెరైటీ స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్న ఈ కుర్ర హీరో లేటెస్ట్ గా నీది నాది ఒకే కథ అనే మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ బరిలో దిగుతోంది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి, ఆ తర్వాత హీరోగా మారిన శ్రీవిష్ణు ఇప్పుడు కంటిన్యూగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలో తన నటనతో మెప్పించిన ఈ కుర్ర హీరో రీసెంట్ గానే మెంటల్ మదలో అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు.
శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ నీది నాది ఒకే కథ.ఆరన మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించగా హీరో నారా రోహిత్ ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. వేణు ఉడుగుల దర్శకుడు. ఇక హీరోయిన్ గా బిచ్చగాడు ఫేమ్ సట్నా టిటూస్ నటించింది.
ఆ మధ్య రిలీజైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఒక్కొక్కటిగా రిలీజైన సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజానికి ఈ సినిమా మీద పాటలు క్యూరియాసిటీ పెంచాయి. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. యూత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమాని ఈ నెల 23న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే శ్రీవిష్ణు కూడా ఈ సారి సమ్మర్ బరిలో దిగుతున్నాడు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







