237 మంది అక్రమ వలసదారులను రక్షించిన లిబియా నౌకాదళ సిబ్బంది
- March 11, 2018
ట్రిపోలీ: లిబియా వైపు అక్రమంగా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన బోటులో వున్న దాదాపు 237 మందిని తమ నౌకాదళ సిబ్బంది సురక్షితంగా తీరానికి చేర్చారని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. లిబియా వైపు రెండు బోట్లలో అక్రమంగా తరలి వస్తున్న దాదాపు 237 మంది ప్రయాణీకులను లిబియాలోని అజ్ జవాఇయా తీర ప్రాంతంలో నీట మునగకుండా సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికార అనడోలు వార్తా సంస్థ వెల్లడించింది. 44 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులతో వున్న ఈ వసలదారుల బృందంలో అధికశాతంమంది ఆఫ్రికాకు చెందిన వారేనని, ఒకరిద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వారుండవచ్చని ఈ ప్రకటనలో వివరించారు. వారికి వైద్య సదుపాయంతో పాటు అవసరమైన మానవతా సాయం కూడా అందచేస్తున్నామని ఈ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







