2021 చివరి నాటికి యూఏఈ - సౌదీ ట్రెయిన్
- March 12, 2018
సౌదీ అరేబియాతో యూఏఈ ట్రైన్ లింక్ 2021 నాటికి అందుబాటులోకి రానుందని సీనియర్ ట్రాన్స్పోర్ట్ అధికారి వెల్లడించారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ల్యాండ్ అండ్ మెరైన్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా సలెమ్ అల్ కథిరి మాట్లాడుతూ, 2021 చివరి నాటికి సౌదీ అరేబియాతో యూఏఈకి ట్రైన్ లింక్ ఏర్పడనుందని చెప్పారు. 2,100 కిలోమీటర్ల పొడవైన ప్యాసింజర్ మరియు కార్గో నెట్వర్క్, మొత్తం ఆరు జిసిసి దేశాల్ని కలుపుతుంది. 2016లోనే యూఏఈ తన భూభాగంలో రైల్ నెట్వర్క్ నిర్మాణాన్ని నిలుపుదల చేసింది. ఒమన్ సైతం తమ డొమెస్టిక్ నెట్వర్క్ ఆలోచనల్లో మునిగిపోయింది. లో క్రూడ్ ఆయిల్ ధరలతో ఏర్పడ్డ బడ్జెట్ డెఫిషినట్స్ కారణంగా ఈ రీజియన్లో ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. దాంతో మూడేళ్ళపాటు ఈ రైల్ నెట్వర్క్ పనులు కూడా ఆలస్యం కానున్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







