'ఎంఎల్ఏ' సాంగ్ విడుదల
- March 13, 2018
నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఎంఎల్ఏ (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) అనే చిత్రం చేస్తున్నాడు. మార్చి 23న మూవీ విడుదలకి ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరచిన రెండో సాంగ్‌ని తాజాగా విడుదల చేశారు. హే ఇందూ అనే సాంగ్ సంగీత ప్రియులని అలరిస్తుంది. కరసాల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇచ్చిన కాజల్ ఎంఎల్ఏ చిత్రం ద్వారా కళ్యాణ్ సరసన రెండో సారి జతకట్టింది. సి భరత్ చౌదరి, ఎంవి కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తుంది. తాజాగా విడుదలైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







