'తమిళ రాకర్స్' వెబ్సైటు అడ్మిన్ లు అరెస్ట్..!
- March 15, 2018
తమిళనాట నిర్మాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న పైరసీ సైట్ తమిళ రాకర్స్ కు చెందిన అడ్మిన్ లను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.. తమిళనాట తమిళ రాకర్స్, తమిళ బాక్స్ అనే సంస్థలు సినిమా రిలీజైన రోజే పైరసీని మార్కెట్లోకి తీసుకొచ్చి నిర్మాతల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా దశాబ్దంగా పైరసీ దారుల ఆగడాలకి అడ్డుకట్ట వేయలేకపోయారు.. ఎట్టకేలకు పోలీసులు రీసెంట్గా తమిళ రాకర్స్ అడ్మిన్ అయిన జాన్, కార్తీక్, ప్రభులని అరెస్ట్ చేశారు. విజుపురం, నెల్లై ప్రాంతాలలో ఈ ముగ్గురి నిందితులని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ ముగ్గురిపైన కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.. కాగా తమిళ రాకర్స్ సైట్ కీలక సూత్రధారులు అరెస్ట్ కావడం పట్ల తమిళ నిర్మాతల మండలి కేరళ, చెన్నై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







