షార్జా ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయిన ప్రయాణికుడు

- March 15, 2018 , by Maagulf
షార్జా ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయిన  ప్రయాణికుడు

షార్జా: వెంటాడే మృత్యువు ..ఎక్కడున్నా కావాలని అనుకొంటే తన వెంట ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకుపోతుంది  షార్జా ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలి చనిపోయాడు. ఇరాక్ నుంచి వయా  బంగ్లాదేశ్ వెళ్తున్నఆ ప్రయాణికుడు షార్జా ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగాడు. ముందుకు నడిచి వెళుతున్న ఆయన కొద్దిసేపటి తర్వాత కింద పడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది బాధిత వ్యక్తిని దగ్గరలోని ఓ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు  కానీ అప్పటికే ఆ ప్రయాణికుడుమృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. ఆయన పార్దీవ దేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని, మృతికి గల కారణాన్ని పరిశోధిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందచేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com