అరుదైన వ్యాధితో 'రెడ్‌ హ్యాండెడ్‌' బాలిక పోరాటం

- March 15, 2018 , by Maagulf
అరుదైన వ్యాధితో 'రెడ్‌ హ్యాండెడ్‌' బాలిక పోరాటం

దుబాయ్‌కి చెందిన 10 ఏళ్ళ బాలిక అరుదైన వ్యాధితో బాధపడ్తోంది. అరబ్‌ ప్రపంచంలో ఈ బాలికకు మాత్రమే ఈ అరుదైన వ్యాధి సోకింది. అత్యంత అరుదైన ఈ వ్యాధి లక్షణమేంటంటే, తీవ్రమైన నొప్పులు, వాపులతో బాధపడటం. చేతులు, కాళ్ళు ఎర్రగా మారిపోతాయి. 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో భరించలేని నొప్పిని అనుభవిస్తోంది ఈ బాలిక. లీన్‌ అనే ఈ బాలిక, 8వ పుట్టినరోజు వరకూ అందరిలానే ఆరోగ్యంగా వుంది. అయితే 8వ పుట్టినరోజు తర్వాతి రోజున ఎర్రబడ్డ కాళ్ళు, చేతులతో తల్లిదండ్రుల్ని షాక్‌కి గురిచేసింది లీన్‌. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళగా, డాక్టర్లు ఆమె ఏ వ్యాధితో బాధపడ్తోందో వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తర్వాత పల్మార్‌ ప్టాఆర్‌ ఎరిత్రోడైసెస్తియా (హ్యాండ్‌ ఫుట్‌ సిండ్రోమ్‌) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 20 మంది మాత్రమే ఈ తరహా వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన డాక్టర్లతో మాట్లాడుతున్నామనీ, పలు టెస్టులు జరిగినా వ్యాధి కారణమేంటో తెలియలేదని లీన్‌ తల్లి యుమ్నా చెప్పారు. యుమ్నా ఆమె కుటుంబం యూఏఈలో 4 ఏళ్ళుగా వుంటున్నారు. వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు లీన్‌ 'ది రెడ్‌ హ్యాండ్‌ ఛాలెంజ్‌' పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com