గల్ఫ్‌లోని తెలంగాణవాసులకు ఎంతో ఊరట:ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
- March 15, 2018
నిజామాబాద్: ఎన్ఆర్ఐ కోసం రాష్ర్ట బడ్జెల్లో రూ.100 కోట్లు కేటాయించడం చరిత్రాత్మకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపిన సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ బాధితులకు అండగా ఉండాలని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కు రెండు రోజుల కిందట అసెంబ్లీ లాబీలో వినతి పత్రాన్ని తాను అందజేశానని, టేబుల్ ఐటంగా తీసుకుని మంత్రులు ఎన్ఆర్ఐ కోసం రూ. 100 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించడం ఒక చరిత్ర అని బాజిరెడ్డి గోవర్ధన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది గల్ఫ్‌లోని లక్షలాది మంది తెలంగాణ ప్రవాసులకు మనోధైర్యాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా తాను గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నానని, అక్కడి సమస్యలను తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకుని వస్తుంటారని బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. ఉమ్మడి రాష్ర్టంలో కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఉన్న బడ్జెట్
తెలంగాణ స్వరాష్ర్టంలో రూ. 100 కోట్లు కేటాయిచండం మరువలేనిదని ఆయన అన్నారు. గల్ఫ్‌లోని కార్మికుల సమస్యలను ఆకలింపు చేసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్ల ఈ బడ్జెట్ భారీగా పెరగడానికి దొహదపడిందని బాజిరెడ్డి పేర్కొన్నారు. గల్ఫ్‌లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తెలంగాణవాసులను ఆదుకోవాలని, వారికి అండగా నిలువాలని, ఉపాధి కోసం వలస వెళ్లిన తెలంగాణవాసులను గల్ఫ్‌లో అక్కడి పాలకులు, వివిధ కంపెనీల యాజమాన్యాలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు.
వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, పాస్‌పోర్టులను లాక్కుని నిర్బంధిస్తున్నారని, చనిపోతే శవాలను కూడా ఇవ్వడం లేదన్నారు. చనిపోయిన వారి ఆర్థిక పరిస్థితి బాగలేనందున.. అక్కడి తోటి కార్మికులు చందాలు వేసుకుని శవాలను స్వగ్రామాలకు పంపాల్సి వస్తోందన్నారు. ఆదుకునే వారు లేక, సమస్యలు చెప్పుకుందామంటే ఎవరి స్పందన లేకుండా తెలంగాణ వాసులు గల్ఫ్‌లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో గల్ఫ్‌లోని కార్మికులు అమితానందాన్ని వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!









