శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య వాగ్వాదం
- March 16, 2018
జెంటిల్మెన్ గేమ్‌గా పేరున్న క్రికెట్లో ఆటగాళ్ళ మధ్య మాటల యుధ్ధం మామూలే... అయితే శ్రీలంక,బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో ఈ స్లెడ్జింగ్‌తో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో లంక,బంగ్లా ఆటగాళ్ళ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు అంపైర్ల తప్పిదాలు కూడా వాతావరణాన్ని హీట్ చేశాయి. వరుసగా రెండు బౌన్సర్లు వేసినా... అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్‌హసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీజులో ఉన్న తమ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు వచ్చేయమంటూ సూచనలు చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ దశలో మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకుని సర్థి చెప్పడంతో మ్యాచ్ మళ్ళీ మొదలైంది. మ్యాచ్ అనంతరం శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య తీవ్ర పరిణామాలు జరిగాయి. రెండు టీంల మధ్య ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. ఉత్కంఠపోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేశారు. దీంతో లంకా ఆటగాళ్లు కొందరు మ్యాచ్ రెఫరీకి పిర్యాదు చేశారు. ఇక ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో సిబ్బంది లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







