దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్సే:రాహుల్
- March 16, 2018
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచగలదని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న పార్టీ 84వ ప్లీనరీలో రాహుల్ మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్కు ఇది తొలి ప్లీనరీ కావడం విశేషం. ప్రజల్లో బీజేపీ ద్వేషాన్ని నింపుతున్నదని, కాంగ్రెస్ పార్టీ ప్రేమను అందిస్తున్నదన్నారు. ఈ దేశం అందరిదన్న అభిప్రాయాన్ని వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. అందరి లాభం కోసమే కాంగ్రెస్ ఏదైనా చేస్తుందన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీ పాలనతో దేశం చాలా అలసిపోయిందని, ఓ కొత్త దిశానిర్దేశం కావాలని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని మునుముందుకు తీసుకువెళ్లగలదని రాహుల్ అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







