సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2..
- March 16, 2018
కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్నాళ్ళు అటకెక్కిన ఈ ప్రాజెక్ట్ ఈ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. యూఎస్ లో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తైనట్టు తెలుస్తుంది. జూన్ లో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విశ్వరూపం చిత్రంలో అవినీతితో పాటు కొన్ని సంఘటనలకి సంబంధించిన సీన్స్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. ఇండియాలోనే కాదు విదేశాలలోను విశ్వరూపం 2 మూవీపై భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!