యూఏఈ నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపితే, ఆ నగదు బదిలీకి ఫీజు చెల్లించాలి
- March 17, 2018
అబుదాబి, యూఏఈలో అతిపెద్ద బ్యాంకైన ఎమిరేట్స్ ఎన్బీడీ ప్రవాసీయులకు మింగుడుపడని వార్త తెలిపింది ఇకపై విదేశాలకు యూఏఈ కరెన్సీని ఉపయోగించి బదిలీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ కరెన్సీలో చెల్లింపులు చేసేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డుల ద్వారా దిర్హమ్స్లో చెల్లింపులు చేసేవారు 1.15 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. యూఏఈ కరెన్సీని ఉపయోగించి అంతర్జాతీయ వాణిజ్య వెబ్సైట్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఈ కారణంగానే ఫీజు చెల్లించాలనే నిబంధన ప్రవేశపెట్టామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. స్థానిక కరెన్సీ ద్వారా వస్తువుల కొనుగోలు, వీదేశీయానాలు చేయడం మంచిదని తమ వినియోగదారులకు అధికారులు సూచించారు. యూఏఈ కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు జరపడం సులభంగా అనిపించినప్పటికీ ఖర్చుతో కూడుకున్న పనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







