గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- February 27, 2026
న్యూ ఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సామాన్యుల కోసం మరో ముందడుగు వేసింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఆధార్ కేంద్రాల వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజలు తమకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్లను వెతకడం కోసం ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఉపయోగించి ‘Aadhaar Seva Kendra’ అని సెర్చ్ చేయడం ద్వారా తమ ఇంటికి దగ్గరగా ఉన్న కేంద్రాలను చూడవచ్చు. ఈ మ్యాప్స్ ద్వారా ఆ కేంద్రం ఎక్కడుంది, అక్కడికి చేరుకునే దారి (Navigation), పనివేళలు వంటి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఈ సదుపాయం ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయనుంది.ఈ కేంద్రాలలో పెద్దలు, చిన్నారుల ఆధార్ నమోదుతో పాటు అడ్రస్, మొబైల్ నంబర్ అప్డేషన్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయని ఉడాయ్ తెలిపింది. ఈ సదుపాయం ఆధార్ సేవలను పొందడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







