ఆనందం ఆడియో విడుదల
- March 18, 2018
మలయాళ హిట్ ఫిల్మ్ ఆనందం అదే పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. సుఖీభవ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని టాలీవుడ్లోకి తీసుకొస్తోంది. గణేష్ రాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమమ్ ఫేమ్ నివీన్ పూలే అతిథి పాత్ర పోషించిన ఈ చిత్రంలో మిగతా వారంతా నూతన నటీనటులే. సచిన్ వారియర్ సంగీతాన్ని అందించిన ఆనందం తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ రాజ్ మాట్లాడుతూ.2010 నుంచి కథ రాసుకున్నాను. రెండేళ్ల కిందట మలయాళంలో ఆనందం మంచి విజయం సాధించింది. కళాశాలలో పర్యటనకు వెళ్లిన కొందరు విద్యార్థుల కథే ఈ చిత్రం. అందరికీ చేరువయే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది. తెలుగులో వచ్చిన హ్యాపీడేస్ సినిమా నాకు స్ఫూర్తినిచ్చింది. అన్నారు. నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ. ఆనందంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఆనందంతో తిరిగి వెళతారు. ముఖ్యంగా ద్వితీయార్థం సినిమా కొత్త అనుభూతిని అందిస్తుంది. యువతతో పాటు కుటుంబమంతా ఈ సినిమాను ఆస్వాదిం చవచ్చు. ఆనందం చూస్తున్నవారికి విద్యార్థిగా తమ అనుభవాలు గుర్తొస్తాయి. అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్, హీరో తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







