తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒక్కటే:కేసీఆర్

- March 18, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం ఒక్కటే:కేసీఆర్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాలన్నీ ఒకే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంచాంగాలన్నీ ఎప్పుడూ తప్పు చెప్పవని.. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు ఎవరి స్టైల్‌లో వారు చమత్కారంగా, గంభీరంగా, హెచ్చరికగా పండితులు చెబుతుంటారని అన్నారు. ఆదివారం ఉగాది పర్వదినాన ప్రగతి భవన్‌లో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత సంస్కృతి మనకు అందించిన గొప్ప శాస్త్ర పరిజ్ఞానం పంచాంగం అని పేర్కొన్నారు. పంచాంగంతో 50 ఏళ్ల తరువాత సంభవించే గ్రహణాన్ని కూడా చెప్పవచ్చు అన్నారు. ఈ ఏడాది తెలంగాణ అద్భుత విజయాలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com