ఇంట్లోకి దూసుకెళ్ళిన విమానం, 10 మంది మృతి
- March 18, 2018
ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం టేకాపైన కొద్దిసేపట్లోకి ప్రమాదానికి గురైంది. విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు. ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకొంది. పీపర్ -23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్‌లోని ప్లారిడెల్ పట్టణంలోని విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది.
దీంతో విమానంలోని ఐదుగురితో పాటు ఇంట్లోని ఐదుగురు మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు. ఇంట్లోకి విమానం దూసుకెళ్ళిన వెంటనే విమానం దగ్దమైంది దీంతో మంటలు వ్యాపించాయి.
ఆరుగురు వ్యక్తులు ప్రయాణించే వీలున్న ఈ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగుు ప్రయాణం చేస్తున్నారు అయితే విమానంలోని ఐదుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు ఇంట్లోకి దూసుకెళ్ళడానికి ముందే విమానం విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.దీంతో విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్ళిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







