ప్రియురాలి రూమ్ నుంచి దూకిన ప్రియుడు
- March 18, 201819 ఏళ్ళ ఇరానియన్ యువకుడు, తన ప్రియురాలి రూమ్ నుంచి కిందికి దూకి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. షార్జాలో నివసిస్తోన్న 15 ఏళ్ళ బాలిక ఇంటికి వెళ్ళిన ప్రియుడు, ఆమె తండ్రి రూమ్‌లోకి రావడంతో, రెండో అంతస్తులో వున్న ఆ రూమ్ నుంచి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రసస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి వర్గాలు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వెల్లడించాయి. తన ప్రియురాలి రూమ్‌లో తాను వున్నప్పుడే, ఆ రూమ్ డోర్‌ని ఆమె తండ్రి 'నాక్' చేయడంతో, భయపడి బాల్కనీలో దాక్కున్న ప్రియుడు, వాట్సాప్ ద్వారా ప్రియురాలితో ఆమె తండ్రి గురించి వాకబు చేశాడు. 30 నిమిషాల తర్వాత కూడా రూమ్‌లోంచి ప్రియురాలి తండ్రి బయటకు వెళ్ళకపోవడంతో, బాల్కనీలోకి కూడా వచ్చేసి, తనను నిలదీస్తాడన్న భయంతో యువకుడు కిందికి దూకినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్