చనిపోయి రెండు వారాలైనా స్వదేశానికి చేరని మృతదేహం
- March 18, 2018
మనామా: రెండు వారాల క్రితం ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ కోచ్ పార్దీవ దేహం, ఇండియాలోని కేరళ స్టేట్‌కి చేరుకోకపోవడంతో మృతుడి బంధువుల మానసిక వేదన రోజురోజుకీ పెరిగిపోతోంది. 'రెండు వారాల క్రితం మా ఫాదర్ ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఆయన మృతదేహం స్వదేశానికి వస్తోందో అర్థం కావడంలేదు. స్పాన్సర్‌తో మాట్లాడానుగానీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కారణంగా కేసు పెండింగ్‌లో వుంది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాకనే పార్దీవ దేహాన్ని పంపించడానికి వీలవుతుందని చెప్పారు' అంటూ మృతుడు తిలకన్ ఒండాయంకర్యాన్ తనయుడు వైషాక్ తిలకన్ చెప్పారు. 'మేం ఏమీ చేయలేని పరిస్థితుల్లో వున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైషాక్. ఆత్మహత్య కారణంగా ఫుట్ బాల్ కోచ్ చనిపోయినట్లు పోస్ట్‌మార్టమ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 22న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ టాలెంట్ అకాడమీలో ఫుట్ బాల్ కోచ్‌గా పనిచేస్తున్న తిలకన్, ఫిబ్రవరి 4 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. జెర్సీలను కొనేందుకు మనామా మార్కెట్‌కి వెళ్ళిన ఆయన ఆ తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చివరికి ఆయన మరణ వార్త తెలిసింది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







