అల్‌కౌజ్‌లోని వేర్‌హోస్‌లో పేలుడు

- December 01, 2015 , by Maagulf
అల్‌కౌజ్‌లోని వేర్‌హోస్‌లో పేలుడు

దుబాయ్‌లోని అల్‌కౌజ్‌లోగల ఓ వేర్‌ హౌస్‌లో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.ఈ పేలుడుతో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడినవారంతాఆసియా కార్మికులుగా గుర్తించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమించింది.వారిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. యంత్రాలను వుంచేందుకు వేర్‌హౌస్‌నికొన్నాళ్ళుగా వినియోగిస్తున్నారు. పేలుడుకు గల కారణాల్ని అన్వేషించేందుకు ఫోరెన్సిక్‌నిపుణుల్ని రంగంలోకి దించారు. ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, విచారణలోతుగా సాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ప్రమాద సమయంలోనలుగురు కార్మికులు ఆ వేర్‌హౌస్‌లో పనిచేస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటివరకూఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, తీవ్ర గాయాలపాలైనవారిని ఎయిర్‌ అంబులెన్స్‌లోఆసుపత్రికి తరలించామనీ, మొత్తం నలుగురికీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందనిఅన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com