శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన
- March 23, 2018
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అదే విధంగా దేశంలో అతిపెద్ద కన్వెక్షన్ సెంటర్‌కు శిలాఫలకం ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్, గ్రీన్‌ఫీల్డ్ సిటీని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు.
2008లో ప్రారంభమైన శంషాబాద్ విమానాశ్రమం క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. పదేళ్లుగా నిరాంటకంగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఏటా లక్షల మందిని విదేశాలకు చేరుస్తూ.. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసింది. అత్యుత్తమ సేవలకుగాను ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దశాబ్ది వేడుకల్లో డెకెడ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టాంప్‌తో పాటు ఎన్వలప్‌ని విడుదల చేశారు. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వంతో మూడు ఎంవోయూలపై సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









