సౌదీపై హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణుల ప్రయోగం
- March 26, 2018
రియాద్ : యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీపై విరుచుకుపడ్డారు. రియాద్ నగరంలోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించారు. తిరుగుబాటు దారులు జరిపిన క్షిపణుల దాడుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సౌదీ సంకీర్ణదళాల అధికార ప్రతినిధి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..రియాద్ నగరంపై తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులు ప్రయోగించారు. వాటిలో మూడు క్షిపణులను తమ బలగాలు ధ్వంసం చేశాయని అన్నారు. సౌదీలోని ఆబా, జీజన్, నజ్రాన్ నగరాల్లోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు క్షిపణులు ప్రయోగించి ఉంటారని అనుమానిస్తున్నామని అన్నారు. కాగా, తామే సౌదీపై క్షిపణులు ప్రయోగించినట్టు హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి మొహ్మద్ అల్-బుఖైతీ సోమవారం తెలిపారు. యెమెన్‌లోని అనేక నగరాలపై సౌదీ సంకీర్ణదళాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయని, ఆ దాడులకు ప్రతీకారంగా క్షిపణులు ప్రయోగించినట్టు పేర్కొన్నారు. సౌదీపై మధ్య స్థాయి, అధిక దూరం ప్రయాణించగల ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







