భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం
- March 26, 2018
భూమి వైపు మరో భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా గుర్తించింది. బెన్నూగా నామకరణం చేసిన ఈ గ్రహశకలం గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వచ్చేస్తోంది. ఇది భూమిని ఢీకొంటే మానవాళి అంతం ఖాయమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది ఏ రోజు భూమిని ఢీకొంటుందో కూడా నాసా అంచనా వేసింది. 2135 సెప్టెంబర్ 25న ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుంది.
ఈ గ్రహశకలం బరువు 7,900 కిలోలు. సూమారు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న రాక్షసబల్లులు అంతరించిపోవడానికి ఇలాంటి గ్రహశకలమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే బెన్నూ ను ఎదుర్కొనేందుకు నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. బెన్నూను అంతరిక్ష నౌక ద్వారా ఢీకొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గంటకు లక్ష కిలో మీటర్ల వేగంతో వస్తున్న బెన్నూను అంతరిక్ష నౌకతో ఢీకొట్టిస్తే.. దాని గతి మారి భూమిని ఢీకొట్టకుండా దారి మళ్లుతుందని అంచనా వేస్తున్నారు.
అది విజయవంతం కాదని భావిస్తే.. అంతరిక్ష నౌకలో అణుబాంబులు నింపి గ్రహశకలాన్ని పేల్చేయాలన్నది రెండో ఆలోచన. బెన్నూను నిరోధించేందుకు అణుబాంబులతో పేల్చేయడమే సరైన మార్గమని నాసా భావిస్తోంది. ఇంత భారీ గ్రహశకలం భూమి వైపు రావడం చాలా అరుదైనదిగా నాసా చెబుతోంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







