వివాదంగా మారిన రూపా 'నమ్మ బెంగళూరు' అవార్డు

- March 27, 2018 , by Maagulf
వివాదంగా మారిన రూపా 'నమ్మ బెంగళూరు' అవార్డు

కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి రూపా మౌడ్గిల్ తీరుపై నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఎన్జీవో తీవ్రంగా మండిపడింది. ఆమెకు 'నమ్మ బెంగళూరు' అవార్డు ఇస్తామని చెప్పనే లేదని స్పష్టంచేసింది. పైగా అవార్డు కోసం ఆమె చేసినంతగా ఎవరూ లాబీయింగ్ చేయలేదని విమర్శించింది. ఈ మేరకు ఒక లేఖను ఎన్జీవో విడుదల చేసింది. అవార్డుల్లో ప్రభుత్వ అధికారి కేటగిరీలో పోటీపడిన నామినీ తీరు మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అవార్డు తనకు రాకపోయినా, నిరాకరించాను అనే బాధ్యతారహిత వ్యాఖ్యలు దారుణమని తీవ్రంగా స్పందించింది. అయితే లేఖలో ఎక్కడా రూపా పేరును మాత్రం ప్రస్తావించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com