కొన్ని ఆహార ఉపయోగాలు
- May 05, 2015
- బెల్లంతో ఉపయోగం: ప్రతి రోజు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అయిపోయాక, కొద్దిగా బెల్లం తినటం వలన శరీరంలో జీర్ణశక్తి పెరగటమే కాకుండా శ్వాస నాళాలు, ఊపిరితిత్తులు, మరియు ఆహార నాళాలు శుద్ధి పడి, రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. సహజమైన తీపి ఉన్న బెల్లం శరీర శక్తిని చాలావరకు పెంచుతుంది.
- మజ్జిగ: వేసవిలో డీహైడ్రేషన్ వంటి సమస్యలకు మజ్జిగ చక్కగా పనిచేస్తుంది. దాహాన్ని తీర్చడం, పేగులను శుభ్రపరచడం, శరీరంలోని కొన్ని విషాలను తొలగించడం, బరువుని తగ్గించడంలో మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది. అజీర్ణం, మలబద్దకంతో బాధపడేవారికి మజ్జిగ ఒక మంచి మందులా పని చేస్తుంది. కడుపులో పుళ్ళు రాకుండా, అసిడిటీ సమస్య తలెత్తకుండా మజ్జిగ కాపాడుతుంది.
- కంటిలో దుమ్ము, ధూళి పడిందని ఇంట్లో ఉన్న వాడేసిన పాత ఐ డ్రాప్స్ ను కంటిలో వేసుకోకండి.అది కంటిచూపుపై తీవ్ర హానికర ప్రభావం చూపిస్తుంది.
- వైద్యుల సూచన లేకుండా పరగడుపున పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు గానీ, యాంటీ బయాటిక్ లుగానీ వాడకండి. దానివల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒంటి నొప్పులు అధికంగా ఉన్నాయని, టాబ్లెట్లను అధికంగా వాడితే, అవి కిడ్నీలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. ఏ టాబ్లెట్లైనా మంచినీటితో వేసుకోండి గానీ, కాఫీ తో టీ తో మరియు ఏ ఇతర పనీయాలతో వేసుకోకండి.
--- లక్ష్మి, దుబాయ్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







