మధ్యప్రదేశ్:హోటల్ భవనం కూలి 10 మంది మృతి
- April 01, 2018
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో హోటల్ భవనం కూలిన ఘటనలో పది మంది మృతి చెందారు.శిథిలాల కింద ఉన్నవారిని రక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.క్షతగాత్రులకు రూ.50 వేలను ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రకటించారు.
శనివారం అర్ధరాత్రి పూట వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ఇండోర్‌లోని సర్వేట బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ భవనాన్ని ఢీకొంది. దీంతో ఈ భవనం కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హోటల్‌లో సుమారు 25 గదులున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇద్దరు మహిళలు సహ మొత్తం పది మంది మరణించారని అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద సుమారు 50 మంది వరకు ఉంటారని అదికారులు అభిప్రాయపడుతున్నారు.
విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలను చేపట్టారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేలను పరిహరం ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రకటించారు. సంఘటనా స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న వారిని రెస్కూటీమ్ కాపాడింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







