అభ్యంతరకర దుస్తులు: 20 మంది మహిళల అరెస్ట్‌

- April 05, 2018 , by Maagulf
అభ్యంతరకర దుస్తులు: 20 మంది మహిళల అరెస్ట్‌

మస్కట్‌: బౌషెర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ 20 మంది మహిళల్ని అభ్యంతరకర దుస్తుల్ని పబ్లిక్‌ ప్లేసెస్‌లో ధరిస్తున్నందుకుగాను అరెస్ట్‌ చేయడం జరిగింది. వీరిలో ఆసియా, ఆఫ్రికా జాతీయులు వున్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. రాయల్‌ ఒమన్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఖువైర్‌, బౌషెర్‌ ప్రాంతాల్లో వీరిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. అరెస్ట్‌ చేసినవారిని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించారు. ఒమన్‌ పీనల్‌ కోడ్‌ - రాయల్‌ డిక్రీ 7/2018 ప్రకారం, సంప్రదాయాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర దుస్తుల్ని వేసుకుని పబ్లిక్‌లోకి వస్తే, నెల నుంచి మూడు నెలల జైలు శిక్ష, 300 నుంచి 500 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com