ప్రముఖ ఒమన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ సెకెండ్‌ ఫేజ్‌ త్వరలో

- April 05, 2018 , by Maagulf
ప్రముఖ ఒమన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ సెకెండ్‌ ఫేజ్‌ త్వరలో

మస్కట్‌:ఇబ్రి - యాంకుల్‌ డ్యూయల్‌ క్యారేజ్‌ వే ప్రాజెక్ట్‌ ఏప్రిల్‌ 9న ప్రారంభించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఫర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ సెక్రెటరీ సలీమ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ నౌమి ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు. రెండో ఫేజ్‌ ఇబ్రి - యాంకుల్‌ డ్యూయల్‌ క్యారేజ్‌ వే పొడవు 34 కిలోమీటర్లు కాగా, ఖర్చు 42,154,831 ఒమన్‌ రియాల్స్‌. ఫస్ట్‌ ఫేజ్‌ 6 ఇలియన్‌ ఒమన్‌ రియాల్స్‌ ఖర్చయినట్లు రోడ్స్‌ డిపార్ట్‌మెంట్‌ - మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో 125 లైటింగ్‌ పోల్స్‌, ఫ్లడ్‌ వాటర్‌ డ్రైనేజ్‌ వంటివి వున్నాయి. భవిష్యత్‌ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com