ట్యాక్సీ ధరల్ని సవరించిన అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
- April 05, 2018
అజ్మన్:అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ట్యాక్సీ కంపెనీలకు సంబంధించి ధరల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. స్థానిక ట్రాన్స్పోర్ట్ సర్వీసులను మెరుగుపర్చడం, అజ్మన్ విజన్ 2021 లక్ష్యాన్ని చేరుకునేందుకుగాను తగిన వ్యూహాల్ని అమలు చేయడంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ సర్వేలు, స్టడీస్ నిర్వహించిన తర్వాతే కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర ఎమిరేట్స్‌కి సంబంధించిన పలు విషయాల్ని పరిశీలించి, అజ్మన్‌లో ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిగణనలోకి తీసుకుని, అత్యుత్తమ సేవలు వారి నుంచి ప్రయాణీకులకు అందేలా ఈ చర్యలు చేపట్టడం జరిగింది.2.5 అరబ్ ఎమిరేట్ దినార్స్‌ని పెంచడం ద్వారా ట్యాక్సీ డ్రైవర్లకు ఊరట కలిగినట్లయ్యింది. అయినప్పటికీ కూడా ఇతర ఎమిరేట్లతో పోల్చితే అజ్మన్‌లో ట్యాక్సీ ఛార్జీలు తక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







