సిమ్లా:లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 20 మంది విద్యార్థులు మృతి
- April 09, 2018
సిమ్లా:హిమచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సర్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా కొంత మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







