'మస్కట్ తెలుగు కళా సమితి' ఘనంగా నిర్వహించిన ఉగాది ఉత్సవం
- April 11, 2018_1523469829.jpg)
మస్కట్:ఉగాది పండుగను పురస్కరించుకొని , మస్కట్ తెలుగు కళాసమితి (ఇండియన్ సోషల్ క్లబ్ తెలుగు విభాగం) ఉగాది ఉత్సవాన్ని అద్భుతంగా, కనులపండువగా హయ్యర్ కాలేజీ అఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ ఉగాది ఉత్సవానికి ప్రముఖ కవి మరియు సినీ పాటల రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు మరియు అరుదైన ఈలపాటతో సంగీతాన్ని అందించే శ్రీ శివప్రసాద్ గారు పాల్గొని తెలుగు కళాసమితి సభ్యులను రంజింపచేశారు.
కార్యక్రమంలో ముందుగా ఒమాన్ దేశపు గీతాన్ని మరియు తెలుగు కళాసమితి నిర్వహిస్తున్న తెలుగు తరగతుల విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల గీతాలను వినిపించారు.
తెలుగు కళాసమితి కార్యవర్గ సభ్యుల సతీమణులు చేసిన దీప ప్రజ్వలన తర్వాత పంచాంగ శ్రవణాన్ని వేదపండితులు శ్రీ విజయకుమార్ గారు వినిపించారు. తర్వాత తెలుగు ఆడపిల్లలు చేసిన ఉగాది మరియు ఇతర నృత్య ప్రదర్శనలు సభ్యులను ఆకట్టుకొన్నాయి.
శ్రీ జొన్నవిత్తుల గారు తనదైన ప్రత్యేక శైలిలో పేరడీ పాటలను, తెలుగు సాహిత్య ఝరిని అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తదుపరి శ్రీ శివప్రసాద్ గారు ఈలపాటతో అనేక త్యాగరాజ, అన్నమయ్య, పురందరదాసు మరియు ఇతర కీర్తనలతో సభ్యులను సమ్మోహనపరిచారు. శ్రీ శివప్రసాద్ గారి ఈలపాటకు వాద్యసహకారాన్ని శ్రీ రఘురాం.హరి మృదంగంతో, శ్రీ రామకృష్ణ కంజీరాతో, శ్రీమతి వాణి భట్ గారు వయోలిన్ తో అందించారు.
ఈ సందర్భంగా అనేక సామజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, హైద్రాబాద్, ప్రతినిధిగా విచ్చేసిన శ్రీమతి పద్మావతి గారిని, శ్రీ జొన్నవిత్తుల గారిని, శ్రీ శివ ప్రసాద్ గారిని, వాయిద్య కళాకారులను ఉగాది పురస్కారాలతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన భారత దేశ రాయబారి శ్రీ ఇంద్రమణి పాండే గారు సత్కరించారు. భారత రాయబార కార్యాలయ ఉద్యోగిని శ్రీమతి నీలూ రోరా విశేష అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు.
ఈ ఉగాది ఉత్సవాన్ని నిర్వహించటానికి సిరి సంపద రియల్ ఎస్టేట్, హైదరాబాద్, భూమాత రియల్ ఎస్టేట్, విశాఖపట్నం, మోడర్న్ ఎక్స్చేంజి, మస్కట్ ఫార్మసీ, ఉదయ్ ఖిమ్జీ మరియు మస్కట్ ఒయాసిస్ వారు సౌజన్యాన్ని అందించారు.
అనేకమంది సభ్యులు హాజరైన ఈ ఉగాది ఉత్సవ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి తో పాటు, సంగీత సాహిత్య సమ్మేళనాన్నిఆత్యత్భుతంగా అందించి మస్కట్ తెలుగు కళా సమితి ఉగాది ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్బంగా అనిల్ కుమార్ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుకళాసమితి ఎన్నొ వివిదమైనా కార్యక్రమలతొ అలరించండమె కాకుండా , కళలను పొషించడము మరియు సమాజిక కార్యక్రమములు చెయ్యడములొ ఓమాన్లొ మెము ముందుటాము అని మరియు కార్యవర్గం మీకు అందుబాటులొ ఉంటారని, విఛ్చెసిన అతిదులందరికి ధన్యవాదములు తెలిపారు.
_1523469814.jpg)
_1523469792.jpg)
_1523469779.jpg)
_1523469767.jpg)
_1523469753.jpg)
_1523467277.jpg)
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







