అమెరికాలో మంచు తుపాను బీభత్సం..
- April 16, 2018
విపరీతంగా కురుస్తున్న మంచు వర్షానికి అమెరికా వణికిపోతోంది. రోడ్లపై అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పలుచోట్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. విపరీతమైన చలిగాలులతోపాటు వడగళ్ల వాన కురుస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. మిన్నియాపోలీస్‌లో 38 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. నాలుగు రోజులుగా అక్కడ ఇదే వాతావరణం కొనసాగుతోంది. సౌత్ డకోటాలోనూ 35 సెంటీమీటర్ల మంచు పడింది. మిడ్ వెస్ట్‌లో మరికొన్ని ప్రాంతాల్లోనూ చలికి జనం గడ్డకట్టుకుపోతున్నారు. ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో మంచు కురవడం గతంలో ఎప్పుడూ లేదు. విస్కాన్‌సిన్, గ్రీన్‌బే ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే 60 సెంటీమీటర్ల మంచు కురవడంతో ఇళ్లు, వాహనాలు అందులో కూరుకుపోయినట్టే అయిపోయాయి.
విపరీతమైన మంచు తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకి కూడా ఆటంకం ఏర్పడుతోంది. పెన్సిల్వేనియా, వర్జీనియాల్లోనూ 20 సెంటీమీటర్ల మేర మంచు జనావాసాలను ముంచేసింది. ఇండియానా, మిచిగాన్, మిన్నిసోటాల్లోనూ మంచు కురుస్తున్నా అది ప్రమాదకరస్థాయిలో లేదు. మిన్నియాపోలీస్‌లో సహా మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మంచు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.
మిడ్‌వెస్ట్‌ను మంచు ముంచెత్తితే.. వర్జీనియా రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీవర్షాలు, ఈదురు గాలులతో భారీ నష్టం వాటిల్లింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు డేమేజ్ అయ్యాయి. వర్జీనియా గవర్నర్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టోర్నడోల ఎఫెక్ట్‌తో న్యూయార్క్‌కి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







