అక్కడ మహిళలకు జీన్స్, మొబైల్ నిషేధం
- April 18, 2018
అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్న మహిళలకు నేటి ఆధునిక యుగంలో కూడా వివక్ష ఎదురవుతూనే ఉంది. తాజాగా మహిళలు ధరించే జీన్స్ దుస్తులు , మొబైల్ ఫోన్ ను నిషేధిస్తూ ఓ గ్రామం కట్టుబాటు చేసింది. ఈ ఘటన హర్యానాలోని ఇసీపూర్ ఖేదీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడ యువతులకు ఇకపై మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని ఒకవేళ ఆలా చేస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గ్రామపెద్దలు. అంతే కాదు యువతులు చీర లేదా స్వదేశీ దుస్తులనే ధరించాలని జీన్స్ ధరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని తీర్పు చెప్పింది. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అక్కడి యువతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తమ అలవాట్లపై అడ్డుచెప్పడానికి వారెవరంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!