ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
- April 18, 2018
బాహుబలి చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి పేరు ప్రపంచ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. ఒకసారేమో ఎన్టీఆర్ తో సోలో సినిమా ఉంటుందని, మరోసారి అక్కినేని ఫ్యామిలీతో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదని తేలిపోయింది. కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు.రాజమౌళి ఈ నిర్ణయంతో అటు ఎన్టీఆర్ ఇటు రాంచరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రారంభమయ్యే ఈ చిత్రానికి బడ్జెట్ కూడా చర్చనీయాంశమే. ఈ సినిమా నిర్మాణానికి సుమారు 100, 150 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో వార్త హల్చల్ చేస్తోంది. ఇదే విషయాన్నీ చిత్ర నిర్మాత దానయ్య కూడా దృవీకరించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









