సిరియాలో సైనిక దళాల మోహరింపుపై సౌదీ - అమెరికా చర్చలు

- April 18, 2018 , by Maagulf
సిరియాలో సైనిక దళాల మోహరింపుపై సౌదీ - అమెరికా చర్చలు

రియాద్‌: సిరియాలో అంతర్జాతీయ సంకీర్ణ దళాల ఏర్పాటులో భాగంగా తమ సైన్యాలను మోహరించే అంశంపై సౌదీ అరేబియా అమెరికాతో చర్చలు జరిపినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆదెల్‌ అల్‌ జుబెయిర్‌ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, గత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రతిపాదించిన అంశమేనని వివరించారు. ఈ అంశంపై తాము ప్రస్తుతం అమెరికాతో చర్చిస్తున్నామని, సిరియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి అక్కడికి సైనిక దళాలు పంపే అంశంపై అమెరికాతో తాము చర్చిస్తూనే వున్నామని ఆయన చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com