వార్నర్ బ్రదర్స్ పార్క్ జులై 25న ప్రారంభం
- April 18, 2018అబుదాబీ వార్నర్ బ్రదర్స్ వరల్డ్, జులై 25 నుంచి సందర్శకులను అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు నిర్వాహకులు. డిసి మెట్రోపోలిస్, గోథామ్ సిటీ, కార్టూన్ జంక్షన్, బెడ్రాక్, డైనమైట్ గల్చ్, వార్నర్ బ్రదర్స్ ప్లాజా వంటి ఆకర్షణలు ఇందులో వున్నాయి. 1.65 మిలియన్ స్కేర్ ఫీట్ వైశాల్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఐకానిక్ క్యారెక్టర్స్‌ని, స్టోరీస్‌నీ సందర్శకుల కోసం పొందుపర్చారు. 29 రైడ్స్, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ పార్క్‌లో ప్రధాన ఆకర్షణలు. రీజియన్‌లో ఈ తరహా పార్క్ ఇదే తొలిసారి. 1 బిలియన్ డాలర్స్ ఖర్చుతో పార్క్‌ని ఏర్పాటు చేసినట్లు డెవలపర్ మిరాల్ సంస్థ ఛైర్మన్ అల్ ముబారక్ చెప్పారు. బ్యాట్‌మెన్, సూపర్ మేన్, వండర్ విమెన్, బగ్స్ బన్నీ, విల్ ఇ కోయెటో, స్కూబీ డూ వంటివి తమ జీవితంలోకి వచ్చిన అనుభూతిని సందర్శకులు పొందే వీలుంది ఈ పార్క్‌లో.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!