300 మందికి శిక్షలు విధించిన ఇరాక్
- April 18, 2018
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల అడ్డుకట్టకు ఆ దేశ ప్రభుత్వం పూనుకుంది. ఇస్లామిక్ స్టేట్‌కు సహకరించిన వారికి ఇరాక్ ప్రభుత్వం కఠిన శిక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో 300మందికి శిక్షలు విధించింది. వారిలో విదేశీయులు, మహిళలు కూడా ఉన్నారు. ఉగ్రవాద సంస్థతో పనిచేస్తున్నారన్న ఆరోపణలపై కొంతమందిని మోసుల్, దేశ రాజధాని నగరం బాగ్దాద్‌లోని న్యాయస్థానాల్లో విచారణ నిర్వహించినట్లు న్యాయనిపుణులు వెల్లడించారు. వారికి శిక్షలు విధించినట్లు తెలిపారు. కాగా, అనుమానితులను శిక్షిస్తున్న నేపథ్యంలో ఇరాక్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇలా శిక్షలు విధించడం వల్ల అమాయకులు చనిపోవడంతో పాటు బాధితులకు సరైన న్యాయం అందదని ఆ సంస్థ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







