శ్రీశ్రీ రవిశంకర్ కు అంతర్జాతీయ అవార్డు
April 20, 2018
ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్‌ను ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ లీడర్‌షిప్ అవార్డు వరించింది. లాస్ ఏంజెలిస్ లోని టోలరెన్స్ మ్యూజియం లో ఆయనకు సైమన్ వీసెంథల్ కేంద్రం ఈ అవార్డును ప్రదానం చేసింది. రవిశంకర్ ఓ స్నేహితుడే కాదు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, విద్యాపరమైన అభివృద్ధి, సుహృద్భావ వాతావరణం నెలకొల్పడం లాంటి అంశాల్లో ఆయన మాతో కలిసి కృషి చేస్తున్నారు అని మానవ హక్కుల సంస్థ (హెచ్‌ఆర్‌వో) ఉపాధ్యక్షుడు రబ్బీ అబ్రహామ్ కూపర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పెర్, అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ సహా అమెరికా చట్ట సభ సభ్యులు, 12 దేశాల రాయబారులు హాజరయ్యారు.