సాహోలో మరో బాలీవుడ్ బ్యూటీ!
- April 20, 2018
బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సాహూ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. కళ్ళు చెదిరే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాపై అభిమానులలో ఉండే అంచనాలు దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రం బాలీవడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద సాగె భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులని కట్టిపడేస్తాయని వినికిడి.
కాగా ఈ చిత్రంలో మరో అందాల తార కూడా జాయిన్ అయింది. బాలీవుడ్ భామ ఎలివిన్ శర్మ ఈ చిత్రంలో నటిస్తునట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తాను యాక్షన్ సన్నివేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాని ఎలివిన్ శర్మ తెలిపింది. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రభాస్, సుజిత్ కు కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం