ఇండియాకు క్షమాపణ చెప్పిన బ్రిటన్
- April 19, 2018
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటనను వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనల్లో త్రివర్ణ పతాకం చినిగిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. మోదీ పర్యటనను నిరసిస్తూ పార్లమెంట్ స్కేర్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో త్రివర్ణ పతాకం చినిగిపోయింది. దీంతో అక్కడి భారత అధికారులు ఈ ఘటనపై విదేశాంగ కార్యాలయంతోపాటు స్కాట్లాండ్ యార్డ్‌కు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే పార్లమెంట్ స్కేర్‌లో జరిగిన ఘటన మమ్మల్ని అసంతృప్తికి గురిచేసింది. దీని గురించి తెలిసిన వెంటనే హై కమిషనర్ యష్‌వర్ధన్ కుమార్ సిన్హాతో మాట్లాడాం. మోదీ పర్యటన కారణంగా ఇండియాతో యూకే బంధం మరింత బలోపేతమైంది అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పార్లమెంట్ స్కేర్‌లో మోదీకి వ్యతిరేకంగా 500 మంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఇందులో యూకే సిఖ్ ఫెడరేషన్‌కు చెందిన ఖలిస్థాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ సంతతి వ్యక్తి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలోని మోదీని వ్యతిరేకించే మైనార్టీలు కూడా వీళ్లలో ఉన్నారు. అయితే ఈ ఆందోళనలను ఖండిస్తూ పార్లమెంట్‌లో ప్రకటన చేయాల్సిందిగా కన్జర్వేటిప్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్.. ప్రధాని థెరెసా మేను కోరినా ఆమె స్పందించలేదు.
ఈ ఘటనను ఖండించకపోయినా.. ఇండియా తమకు మంచి మిత్రదేశమని, యూకే అభివృద్ధిలో భారతీయులు తమ వంతు పాత్ర పోషించారని మే కొనియాడారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం