'మహానటి' లో 'మూగ మనసులు' పాట ..
- April 21, 2018
కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన మహానటి టీజర్ రిలీజై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా తొలి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'మూగ మనసులు.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో' అనే సిరివెన్నల సీతారామ శాస్త్రి గీతం ఆకట్టుకుంటోంది. మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్, అనురాగ్ పాడారు. ఇక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ పాటకు అనుగుణంగా ఆడి పాడి అలరించారు. సెట్టింగ్స్ కూడా ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మే 9న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అశ్వనీ దత్, కూతురు ప్రియాంకదత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం