తెలుగు రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక
- April 21, 2018
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. శనివారం, ఆదివారం రాష్ట్రంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చిరస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎండలు మండుతున్నయి. శుక్రవారం అనేక చోట్ల 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో ప్రజలు బంబెలెత్తిపోతున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది.
మరో వైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయట తిరగరాదని అధికారులు తెలిపారు. బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







