అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన సినీ ప్రముఖుల సమావేశం…

అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన సినీ ప్రముఖుల సమావేశం…

హైదరాబాద్:అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో సినీ పెద్దలు క్యాస్టింగ్‌ కౌచ్‌, టాలీవుడ్‌ సమస్యలపై చర్చించారు. సమావేశానికి సినీ పరిశ్రమలోని 24 విభాగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం సినీ వర్గాలు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరికాసేపట్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌తో సినీప్రముఖులు భేటీ కానున్నారు.

Back to Top