అమెరికాతో ఒప్పందాలా..?..ఉ.కొరియాకు ఇరాన్ హెచ్చరిక
- April 22, 2018టెహ్రాన్: అమెరికాతో ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయాలని ఇరాన్ ఉ.కొరియాకు సూచించింది. తమ దేశంతో ఆరు దేశాల కూటమి కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని పున్ణసమీక్షిస్తామనంటం ద్వారా అమెరికాలోని ట్రంప్ సర్కారు తనతో చర్చలకు సిద్ధపడే దేశాలకు ప్రమాదకర సందేశాలను పంపుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ హెచ్చరించారు. న్యూయార్క్లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అమెరికా తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయటంలో విఫలమవటం మాత్రమే కాక దానిని మరింత విస్తరించాలంటోందని విమర్శించారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాక ప్రపంచ దేశాలకు కూడా ప్రమాదకర సందేశమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి